🍏🍎 Church Of Christ: *యేసు క్రీస్తు యొక్క ఉనికి*
🍏🍎 Church Of Christ: *యేసు క్రీస్తు యొక్క ఉనికి*
హెబ్రీయులకు 1:2
*ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. *ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను.*
🗣️వివరణ:-
ప్రపంచములు అనగా క్రిస్తు నందున్న నూతన సృష్టి అని అర్ధం.... ఈ నూతన సృష్టి కలుగుటకు దేవుని వాక్యము అవసరం...
*అలాగే ప్రపంచాలు అనగా ఫుట్ నోట్స్ లో యుగములు*.... అని ప్రాచినప్రతుల యొక్క సారాంశం.... కనుక భౌతిక ప్రపంచం కాదని అక్కడే తేలిపోయింది.... ఇక యుగాలు అంటే ప్రకటన గ్రంథం లో చెప్పబడిన కాలాలు.
కనుక *దేవుడు కుమారుని ద్వారా మాటలాడుట ప్రారంభమైనతరువాత నుండి కలిగింది*..... అంటే అంతకు ముందు అనగా కాలము లేనప్పుడు కుమారుడు మాట్లాడలేదు అని గ్రహించాలి.....
అప్పుడు దేవుడు పలికెను... *ఈ భౌతికమైన సృష్టి కలుగుటకు దేవుడు తప్ప అందులో ఎవరి ప్రమేయము లేదు.*👇👇👇
✍️1...కొలస్సీయులకు 1:13 ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన *తన కుమారునియొక్క రాజ్యనివాసులనుగా చేసెను.*
రాజ్య నివాసులు అనగా అత్మసంబందులు.
వీరిని దేవుడు తనకుమారునిద్వారా... కలుగజేసేను. అందుకు అవసరమైన అత్మసంబంధమైనవి..... క్రీస్తు ద్వారానే దేవుడు కలుగజేసెను
✍️2...కొలస్సీయులకు 1:15 ఆయన అదృశ్యదేవుని స్వరూపియై *సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు.*
👉 ఇక్కడ మళ్ళీ సర్వసృష్టికి అనే పదం వాడబడి.... *ఆదిసంభూతుడు అని పౌలు గారు చెపుతున్నారు*.... అనగా ముందు కలిగినవాడు అని
దేనికి ముండు❓
*నూతన సృష్టికి ముందు* కలిగినవాడు... ఎప్పుడు అంటే మృతులలోనుండి.... లేచుటలో అని clear గా ఉంది అంతేగానీ భూమి అకాసములు కలుగకమునుపు కాదు...👇👇
♨️కొలస్సీయులకు 1:18 సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియైయుండి *మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను*
❤️ యేసు వారికి నూతనసృష్టి తరువాత అన్నిటిలో ప్రాముఖ్యము దేవుడు కలుగజేయుటకు ప్రణాళికను కళిగి వున్నాడు
🔯మీకా 5:2 బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబము లలో నీవు స్వల్పగ్రామమైనను *నాకొరకు ఇశ్రాయేలీ యులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును*;
*పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను.*
✅1....పరలోకము నుండి వస్తాడు.... అని లేఖనం చెప్పలేదు... ఇది గమనించాలి.
✅2.... పురాతన కాలం అని లేఖనం
చెప్పింది.... అంటే కాలానికి ముందు కాదు అని గమనించాలి.....
✅3....ఎదేను తోటలో స్త్రీ సంతానం గా క్రీస్తు ప్రత్యక్షత (వాగ్దాన రూపంలో ) ప్రారంభమైనది.అంటే భౌతిక సృష్టి తరువాతే
👇👇👇👇👇👇👇👇
*ముగింపు*:--
💕1..క్రీస్తు లేఖనాలలో,వాగ్దానం రూపంలో ప్రత్యక్ష పర్చబడినవాడే...
💕2...క్రీస్తు దేవుని సంకల్పం లొ ఉన్నవాడే గానీ
పరలోకంలో దేవునివద్ద దేవుని కుమారునిగా నో లేకా దేవునితో సమానం గల ఇంకొక దేవుడు గానో లేడు అని
రూఢిగా గ్రంథం చెపుతుంటే....
✡️ *గ్రంథం చెప్పిన దానికంటే ఎక్కువగా*,, గ్రంథం ను అపార్ధం చేసుకొని
*క్రీస్తు పై అభిమానం*
పెంచుకోవడం వలన
*ఈ సత్యం ఎంతచెప్పినా అనేకులకు అర్ధం కావడమే లేడు*.... కానీ దేవుడు అందరి హృదయాలను తెరిచి సత్యాన్నే ప్రేమించే వారికి తన సంకల్పం గ్రహించు హృదయాన్ని ఇస్తారు.
*సత్యము కొరకు నిలవబడాలని, సత్యాన్ని ప్రకటిస్తున్నవారికి అండగా ఉంటారని ఆశిస్తూ*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐
మీ సహోదరుడు
రామరాజు
క్రీస్తు సంఘం.
Comments
Post a Comment