🍓🍓. ఆదియందు *యేసువారు* దేవిని వాక్యమై ఉంటే?????

 🍓🍓. ఆదియందు *యేసువారు* దేవిని వాక్యమై  ఉంటే?????


మరలా ఆయనకు *వాక్యము అను నామము ఎందుకు పెట్టబడింది?*


❓❓మృతులలో నుండి లేచి పరలోకానికి యేసు వెళ్లిన తరువాత జరుగుచున్న సంగతి ...అంతే గానీ అదిలో జరిగింది కాదు👇👇

ప్రకటన గ్రంథం 19:13 

*రక్త ములో ముంచబడిన  వస్త్రము  ఆయన  ధరించుకొని యుండెను.* మరియు 


🕯️ *దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది.*


💐💐 *ఆదియందు ఏం జరిగింది* ❓💐💐


👉🏻ఆదియందు వాక్యం ఉండెను 


యోహాను సువార్త 1:1 *ఆదియందు వాక్యముండెను* , వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.



👉🏻ఉన్న వాక్యం లేదా వాక్కు ఎక్కడిది??


వాక్కు లేదా వాక్యం ఇది దేవునిది

👇


అపొస్తలుల కార్యములు 6:2 అప్పుడు పండ్రెండుగురు అపొస్తలులు తమయొద్దకు శిష్యుల సమూహమును పిలిచిమేము *దేవుని వాక్యము* బోధించుట మాని, ఆహారము పంచిపెట్టుట యుక్తముకాదు.


అపొస్తలుల కార్యములు 6:7 *దేవుని వాక్యము* ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూష లేములో బహుగా విస్తరించెను; మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి.



అపొస్తలుల కార్యములు 8:14 సమరయవారు *దేవుని వాక్యము* అంగీకరించిరని యెరూషలేములోని అపొస్తలులు విని, పేతురును యోహానును వారియొద్దకు పంపిరి.


అపొస్తలుల కార్యములు 12:24 *దేవుని వాక్యము* ప్రబలమై వ్యాపించుచుండెను.


అపొస్తలుల కార్యములు 13:5 వారు సలమీలో ఉండగా యూదుల సమాజమందిరములలో *దేవుని వాక్యము* ప్రచురించుచుండిరి. యోహాను  వారికి  ఉపచారము  చేయువాడై  యుండెను.


అపొస్తలుల కార్యములు 13:7 ఇతడు వివేకముగలవాడైన సెర్గి పౌలు అను అధిపతియొద్దనుండెను; అతడు బర్నబాను సౌలును పిలిపించి *దేవుని వాక్యము* వినగోరెను.


అపొస్తలుల కార్యములు 13:44 మరుసటి విశ్రాంతిదినమున దాదాపుగా ఆ పట్టణ మంతయు *దేవుని వాక్యము* వినుటకు కూడివచ్చెను.


అపొస్తలుల కార్యములు 16:32 అతనికిని అతని ఇంటనున్న వారికందరికిని *దేవుని వాక్యము* బోధించిరి.


అపొస్తలుల కార్యములు 17:13 అయితే బెరయలోకూడ పౌలు *దేవుని వాక్యము* ప్రచురించుచున్నాడని థెస్సలొనీకలో ఉండు యూదులు తెలిసికొని అక్కడికిని వచ్చి జనసమూహములను రేపి కలవరపరచిరి.


అపొస్తలుల కార్యములు 18:11 అతడు వారిమధ్య *దేవుని వాక్యము* బోధించుచు, ఒక సంవత్సరము మీద ఆరునెలలు అక్కడ నివసించెను.


వాక్యము దేవునిది..


👉🏻 దేవుని వాక్కు ఎక్కడుంది??


యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యముండెను, వాక్యము *దేవునియొద్ద ఉండెను* , వాక్యము దేవుడై యుండెను.


యోహాను సువార్త 1:2 ఆయన ఆది యందు *దేవునియొద్ద ఉండెను* . సమస్తమును ఆయన మూలముగా కలిగెను,


👉🏻 దేవుని వాక్యము దేవునియొద్ద ఎలా ఉన్నది??


 *వ్యక్తిగా ఉన్నదా??* 


"దేవుని వాక్యము"... అనే వేరొక  వ్యక్తి ఉన్నట్టు గ్రంధంలో ఎక్కడుంది❓❓


వేరే 65 పుస్తకాల్లో వాక్యము గురించి అయితే ఉన్నది కానీ

👇

 ఎక్కడా కూడా  వాక్యము *అంటే* *మరొక వ్యక్తి అనే విషయం చెప్పలేదు* ....


కాబట్టి ఈ విషయంలో తొందరపడకుండా 


 *యోహాను సువార్త లో ఆయన అని కనబడుతోంది కదా* ....కాబట్టి వాక్యము అంటే వ్యక్తే అనే నిర్ణయానికి రాకుండా  లోతుగా పరిశీలించి నిర్ణయం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


వాక్యము ...ఆయన అని చెప్పబడినది గనుక చాలామంది ఆయన అంటే యేసుక్రీస్తు అని తగిలించారు....

👆

ఇది సరైనదేనా ❓❓


యేసుక్రీస్తు వారు యోహాను సువార్త లో ఇలా అన్నారు...


యోహాను సువార్త 17:14 *వారికి* 

👇


 *నీ వాక్యమిచ్చి యున్నాను* . నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. 


🏵️వాక్యము అనే యేసుక్రీస్తు....

 దేవుని వాక్యము అనే వేరొక దాన్ని ప్రకటన చేశాడా??


లేదా....బైబిల్ లో రెండు వాక్యాలు ఉన్నాయా??(క్రీస్తు అనే పేరు గల వాక్యం ఒకటి, దేవుని వాక్యము అనేది ఇంకొకటా)


కానే కాదు



🎯యేసుక్రీస్తు అనగా దేవుని వాక్యము అనే నిర్వచనం ఎక్కడుంది❓❓


పైగా గ్రంధంలో ఇలా వ్రాయబడింది


ప్రకటన గ్రంథము 19:13 రక్త ములో ముంచబడిన  వస్త్రము  ఆయన  ధరించుకొని యుండెను. మరియు *దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది* .


వాక్యం అంటేనే యేసుక్రీస్తు అయితే మళ్ళీ దేవుని వాక్యము అనే పేరు ఆయనకు పెట్టడం లో ఏమాత్రం అర్ధం లేదు...


కనుక దయచేసి యోహాను సువార్త లో దేవునియొద్ద ఉన్న వాక్యము అనగానే చటుక్కున అక్కడ "యేసుక్రీస్తు" అని తగిలించడం సరైన వివరణ కానే కాదు....

Comments

Popular posts from this blog

🌴🌴దేవుడు హెచ్చించిన యేసు ప్రభువు వారు మనుష్యుడే*

*వాక్యము శరీరదారి* అవ్వడం అంటే ఏమిటో.... క్రింది వివరణ ద్వారా మనము గ్రహించగలము👇👇🎯🎯