*వాక్యము శరీరదారి* అవ్వడం అంటే ఏమిటో.... క్రింది వివరణ ద్వారా మనము గ్రహించగలము👇👇🎯🎯

 *వాక్యము శరీరదారి* అవ్వడం అంటే ఏమిటో.... క్రింది వివరణ ద్వారా మనము గ్రహించగలము👇👇🎯🎯



💐💐💐💐💐💐💐💐💐💐


*దేవుని వాగ్దానరూపకమైన మాట తప్పిపోకుండ శారాకు కుమారుడు కలిగెను* 



ఆదికాండము 17

19 *దేవుడు–నీ భార్యయైన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును*; 


*నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు*; 


అతని తరువాత అతని సంతానముకొరకు నిత్యనిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను.౹


రోమా 9

6 అయితే *దేవునిమాట తప్పిపోయినట్టు కాదు*; ఇశ్రాయేలు సంబంధులందరును ఇశ్రాయేలీయులు కారు.౹


9 *వాగ్దానరూపమైన వాక్యమిదే*— మీదటికి ఈ సమయమునకు వచ్చెదను; అప్పుడు *శారాకు కుమారుడు కలుగును*.



💐💐💐💐💐💐💐💐💐💐


జెకర్యాకు ఇవ్వబడిన వాగ్దాన మాటలు వాటికాలమందు నెరవేరడమువలన యోహాను కలిగెను 


లూకా 1

13 అప్పుడా *దూత అతనితో జెకర్యా భయపడకుము*; 


నీ ప్రార్థన వినబడినది, *నీ భార్యయైన ఎలీస బెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు.*


20 *మరియు నా మాటలు వాటికాలమందు నెరవేరును*; 


నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినమువరకు నీవు మాటలాడక మౌనివై యుందువని అతనితో చెప్పెను.


57 *ప్రసవకాలము వచ్చినప్పుడు ఎలీసబెతు కుమారుని కనెను.*


60 *తల్లి* –ఆలాగు వద్దు; *వానికి యోహానను పేరు పెట్టవలెనని చెప్పెను.*


💐💐💐💐💐💐💐💐💐💐



గలతియులకు 4:4 అయితే *కాలము పరిపూర్ణమైనప్పుడు* దేవుడు తన కుమారుని పంపెను;*ఆయన స్త్రీయందు పుట్టి,* 👇🏼👇🏼


*మరియ యేసును కనడానికి, నిరర్థకముకాక వాటికాలమందు సిద్ధించు దేవుని మాటలను నమ్మెను కనుక యేసును గర్భము ధరించెను* 


👇🏼👇🏼👇🏼

లూకా 1

31 *ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు*;


37 *దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్థ కము కానేరదని ఆమెతో చెప్పెను.*


38 *అందుకు మరియ–ఇదిగో <e>ప్రభువు</e> దాసురాలను;* 


*నీ మాటచొప్పున నాకు జరుగును గాక అనెను*. 


అంతట దూత ఆమెయొద్ద నుండి వెళ్లెను.


45 *<e>ప్రభువు</e> ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును*


 గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. 



యోహాను 1

45 ఫిలిప్పు నతనయేలును కనుగొని — *ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలును ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి;* 


*ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు* అని అతనితో చెప్పెను.౹


హెబ్రీయులకు 10

7 *అప్పుడు నేను–గ్రంథపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని.*




లూకా 1

68 <e>ప్రభువైన</e> ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, వారికి విమోచన కలుగజేసెను *తన సేవకుడైన దావీదు వంశమునందు మనకొరకు రక్షణ శృంగమును*, అనగా మన శత్రువులనుండియు మనలను ద్వేషించు వారందరి చేతినుండియు తప్పించి రక్షణ కలుగజేసెను. *దీనినిగూర్చి ఆయన ఆదినుండి తన పరిశుద్ధప్రవక్తల నోట పలికించెను.* ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రియైన *అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసికొనుటకును* మనము శత్రువుల చేతినుండి విడిపింపబడి, మన జీవిత కాలమంతయు నిర్భయులమై, ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును *ఈ రక్షణ కలుగజేసెను*.



రోమా 1

2 దేవుని సువార్తనిమిత్తము ప్రత్యేకింపబడినవాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికి అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికందరికి (శుభమని చెప్పి) వ్రాయునది. మన తండ్రియైన దేవునినుండియు, ప్రభువైన యేసు క్రీస్తునుండియు, కృపాసమాధానములు మీకు కలుగు గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన *యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తలద్వారా ముందు వాగ్దానముచేసెను*. యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూ పింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయనద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తువారుగా ఉండుటకు పిలువబడి యున్నారు.



54 *అబ్రాహామునకును అతని సంతానమునకును యుగాంతమువరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసికొందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను.*

Comments

Popular posts from this blog

🌴🌴దేవుడు హెచ్చించిన యేసు ప్రభువు వారు మనుష్యుడే*

🍓🍓. ఆదియందు *యేసువారు* దేవిని వాక్యమై ఉంటే?????