లోభి

లోభి

లోభి అంటే ఎవరు?
అత్యాశాపరుడు,
పిసినారి,ధనమును మాత్రమే అమితంగా  ప్రేమించువాడు.

లోభి తాను సంపాధించినది చూచుకొని మురిసిపోతాడు గాని, దానిని మాత్రం అనుభవించలేడు.

 లోభత్వము కలిగినవాడు 'విగ్రహారాధికుడు.'

విగ్రహారాధికుడై యున్నలోభి క్రీస్తుయొక్కయు దేవునియొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును (ఎఫెస్సి 5:5)

కారణం? ఒక వ్యక్తికి దేనిపైన అత్యాశవుందో? దానిని అతడు ఆరాధిస్తున్నట్లే. 'ఆశ' కలిగి వుండాలి.  దానిలో తప్పులేదు. ఆశలేకపోతే మనిషి జీవించలేడు.ఒక సైన్స్ పత్రిక ఇచ్చిన నివేదిక ఇది. ఒక వ్యక్తి ఆహారం లేకుండా 54 రోజులు, నీరు లేకుండా 3 రోజులు, ఆక్సిజెన్ లేకుండా 8 నిమిషాలు జీవించగలడు. కాని, ఆశ లేకుండా ఒక్క క్షణం కూడా జీవించలేడు. ఆశ సమర్ధనీయమైనది అయితే? ఆశగల నీ ప్రాణమును తప్పక ఆయన తృప్తి పరుస్తాడు. ఒకవేళ నీ ఆశకు అంతేలేకుండా పొతే? ఆశ అత్యాశగా మారితే? నీవు విగ్రహారాధికుడుగా మారతావు. నీ ఆశ హద్దులుమీరినప్పుడు, దానిని నెరవేర్చుకోవడానికి ఎట్లాంటి పని చెయ్యడానికైనా వెనుకాడవు. కారణం? నీ హృదయం అత్యాశతో నిండిపోయింది. దానిని దురిశ అంటాము.

 లోభి దేవుని రాజ్యమునకు హక్కుదారుడు కాదు:

విగ్రహారాధికుడై యున్నలోభి క్రీస్తుయొక్కయు దేవునియొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును (ఎఫెస్సి 5:5

 లోభి కుటుంబ అవసరాలు తీర్చలేడు:

లోభి తన యింటివారిని బాధపెట్టును' (సామెతలు 15:27).

సంపాధించిన సంపాదనను, తదనుగుణంగా సద్వినియోగ పరచుకోవాలి. దానిని ఎవ్వరూ కాదనలేని విషయం. పొదుపు చెయ్యాలి. అయితే, ఆ పొదుపుకూ ఒక హద్దుండాలి. పిసినారి వాళ్ళ పిల్లలు తినినా తరిగిపోతుందనుకుంటాడు. వారి కనీస అవసరాలు కూడా తీర్చడు. సంపాధించినదంతా తనతో తీసుకువెళ్తాడా అంటే, అదీలేదు. మరి దేనికోసం కష్టపడినట్లు?

 లోభి స్నేహాన్ని ఎవ్వరూ కోరుకోరు.

లోభితో సాంగత్యము చేయకూడదు భుజింపనుకూడదు. (1 కొరింది 5:11).

మా క్లాస్ మేట్ ఒకడుండేవాడు. వాడు పరమ పిసినారి. వాడిదగ్గర ఎప్పుడూ, 500 రూపాయల నోట్ ఉండేది. మేము ముగ్గురో, నలుగురుమో బయటకి వెళ్తే, ఏదైనా రోడ్ ప్రక్కన “టీ” త్రాగితే, వాడు టక్ ని 500 నోట్ బయటకు తీసేవాడు. వాడికి తెలుసు, పది రూపాయలకోసం చిల్లరివ్వడని. వీడి సంగతి తెలిసి మేమే యిచ్చేవాళ్ళం. ఎప్పుడైనా బిల్ ఎక్కువైన సందర్భమొస్తే? బిల్ కట్టే సమయానికి, మెల్లగా ఫోన్ పట్టుకొని బయటకి వెళ్లిపోయేవాడు. సంవత్సరమంతా ఆ నోట్ ని అట్లానే కాపాడుకొనేవాడు. వాడి పిసినారితనం మాత్రం మా జీవితాంతం గుర్తుండిపోతుంది. పిసినారితనం వల్ల వాడు సంపాదించింది ఏమి లేదు. మేము కోల్పోయింది ఏమిలేదు. కానీ, ఆ పిసినారితనం, అతనిని అందరిలో చులకన చేసింది. ఒక చెడ్డపేరు సార్ధకమయ్యింది.

 లోభి శాపగ్రస్తుడు:

పాపమునకు ప్రాయశ్చిత్తము వుందిగానీ, శాపమునకు ప్రాయశ్చిత్తము లేదు. నిత్యమరణమే శరణ్యం.

లోభి శాపగ్రస్తుడు' (2పేతురు 2:14). నీవు శాపగ్రస్తుడవైతే? ఆయన అంటున్నాడు. 'శపింప బడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతల కును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి'. (మత్తయి 25:41). అంటే, లోభత్వము యొక్క గమ్యము? "నిత్యాగ్ని" లోభత్వము ఒక విగ్రహంలా మారితే? నీవు విగ్రహారాధికుడులా మారతావు.

'విగ్రహారాధకులు' అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము. (ప్రకటన 21:8) వద్దు! ఇది వినడానికే భయంకరం. సరి చేసుకుందాం. ఆ నిత్య రాజ్యాన్ని చేరుకుందాం. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్!

Comments

Popular posts from this blog

🌴🌴దేవుడు హెచ్చించిన యేసు ప్రభువు వారు మనుష్యుడే*

🍓🍓. ఆదియందు *యేసువారు* దేవిని వాక్యమై ఉంటే?????

ఆదికాండము 1:1 *ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.*