Posts

Showing posts from 2019

💥💥 *సంకల్పము దేవునిదే* 💥💥

💥💥 *సంకల్పము దేవునిదే* 💥💥 1దినవృత్తాంతములు 28:9: సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రియొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, *ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు.* నీవు ఆయనను తెలిసికొని హృదయపూర్వకముగాను మనః పూర్వకముగాను ఆయనను సేవించుము,ఆయనను వెదకినయెడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించినయెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసి వేయును. కీర్తనలు 33:11: యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును *ఆయన సంకల్పములు* తరతరములకు ఉండును. అపో.కార్యములు 2:23: *దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్‌ జ్ఞానమును* అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేత సిలువ వేయించి చంపితిరి. 💥💥 *నిర్ణయాలు దేవునివే*💥💥 అపో.కార్యములు 4:27: ఏవి జరుగవలెనని నీ హస్తమును *నీ సంకల్పమును* ముందు నిర్ణయించెనో, 🍇 *దావీదు దేవుని సంకల్పం ప్రకారం సేవచేశాడు*🍇 అపో.కార్యములు 13:36: దావీదు *దేవుని సంకల్పము* చొప్పున తన తరమువారికి సేవచేసి నిద్రించి, రోమీయులకు 8:28: దేవుని ప్రేమించువారికి, అనగా *ఆయన సంకల్పముచొప్పున* పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగ...

లోభి

లోభి లోభి అంటే ఎవరు? అత్యాశాపరుడు, పిసినారి,ధనమును మాత్రమే అమితంగా  ప్రేమించువాడు. లోభి తాను సంపాధించినది చూచుకొని మురిసిపోతాడు గాని, దానిని మాత్రం అనుభవించలేడు.  లోభత్వము కలిగినవాడు 'విగ్రహారాధికుడు.' విగ్రహారాధికుడై యున్నలోభి క్రీస్తుయొక్కయు దేవునియొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును (ఎఫెస్సి 5:5) కారణం? ఒక వ్యక్తికి దేనిపైన అత్యాశవుందో? దానిని అతడు ఆరాధిస్తున్నట్లే. 'ఆశ' కలిగి వుండాలి.  దానిలో తప్పులేదు. ఆశలేకపోతే మనిషి జీవించలేడు.ఒక సైన్స్ పత్రిక ఇచ్చిన నివేదిక ఇది. ఒక వ్యక్తి ఆహారం లేకుండా 54 రోజులు, నీరు లేకుండా 3 రోజులు, ఆక్సిజెన్ లేకుండా 8 నిమిషాలు జీవించగలడు. కాని, ఆశ లేకుండా ఒక్క క్షణం కూడా జీవించలేడు. ఆశ సమర్ధనీయమైనది అయితే? ఆశగల నీ ప్రాణమును తప్పక ఆయన తృప్తి పరుస్తాడు. ఒకవేళ నీ ఆశకు అంతేలేకుండా పొతే? ఆశ అత్యాశగా మారితే? నీవు విగ్రహారాధికుడుగా మారతావు. నీ ఆశ హద్దులుమీరినప్పుడు, దానిని నెరవేర్చుకోవడానికి ఎట్లాంటి పని చెయ్యడానికైనా వెనుకాడవు. కారణం? నీ హృదయం అత్యాశతో నిండిపోయింది. దానిని దురిశ అంటాము.  లోభి దేవున...

క్రీస్తు సంఘమును గూర్చిన కొన్ని వాస్తవాలు

క్రీస్తు సంఘమును గూర్చిన కొన్ని వాస్తవాలు -------------------------------------------------------- 1.ప్రారంభము:        1.క్రీస్తు చేత కట్టబడెను. మత్తయి 16:18                ‌2.యెరూషలేములో ప్రారంభమైనది  లూకా 24:47        3. సంఘమునకు శిరస్సు క్రీస్తు మాత్రమే. ఎఫెసీ 5:23 2.సంఘము పేరు          1.క్రీస్తు సంఘము రోమా 16:16           2.వేరే ఏ నామమున రక్షణ లేదు ఆపొ 4:12 3.ఆరాధన         1 పాటలు ఎఫెసీ 5:15          2.ప్రార్థన  1తిమోతి 2:8          3.బోధ   అపొ 20:7          4.ఇచ్చుట  1కొరింధీ 16:1-3,2కొరింధీ9:6-7           5ప్రభువు బల్ల 4.సభ్యుడు అగు విధానము. క్రైస్తవుడు అని పిలువబడుట (అపొ 11:26)       1  సువార్త వినుట అపొ 15:7        2 నమ్ముట హెబ్రీ 11...

కృప

*క్రీస్తుద్వారా ప్రత్యక్షం కాబోవు రక్షణ దేవునికృపాయే*👑👑👑👑👑👑 1పేతురు 1:1 యేసుక్రీస్తు అపొస్తలుడైన పేతురు, *తండ్రియైన దేవుని భవిష్యద్‌ జ్ఞానమునుబట్టి,* 1పేతురు 1:3 *మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక*. 1పేతురు 1:4 మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన *జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు,* అనగా *అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు,* ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింప జేసెను. 1పేతురు 1:5 కడవరి కాలమందు బయలుపరచబడుటకు *సిద్ధ ముగానున్న రక్షణ మీకు కలుగునట్లు*, విశ్వాసముద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీకొరకు, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది. 1పేతురు 1:10 *మీకు కలుగు ఆ కృపనుగూర్చ*ి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణనుగూర్చి పరిశీలించుచు, తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలనుగూర్చియు, 1పేతురు 1:13 కాబట్టి మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బర మైన బుద్ధిగలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు *మీకు తేబడు కృపవిషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి.*